News March 22, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News March 25, 2025
ఉద్దానంలో ఆకట్టుకున్న ‘ప్రేమ’ పనసకాయ

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.
News March 25, 2025
శ్రీకాకుళం: అనుమానంతోనే హత్యలు

నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ తూ.గో జిల్లా హుకుంపేటలో ఆదివారం తల్లి కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె ఫోన్‌లో మరొకరితో చాటింగ్ చేయడాన్ని చూసి సహించని శివకుమార్.. పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.
News March 25, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. మొత్తం 50 అర్జీలు స్వీకరించామన్నారు