News March 22, 2025

ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

image

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.

Similar News

News November 3, 2025

కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

image

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.

News November 3, 2025

భూపాలపల్లి: షాపు నంబర్ 49, 50లకు ఓపెన్ డ్రా

image

గత నెల 27న నిర్వహించిన మద్యం దుకాణాల డ్రాలో నిలిచిపోయిన రెండు షాపులకు ఓపెన్ టెండర్ ప్రక్రియలో భాగంగా డ్రా నిర్వహించారు. సోమవారం భూపాలపల్లి కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ షాపు నంబర్లు 49, 50లకు డ్రా తీశారు. షాపు నంబర్ 49 (చల్వాయి) కోసం 23 దరఖాస్తులు రాగా, అది సదర్ లాల్ అనే వ్యక్తికి దక్కింది. అదే విధంగా, షాపు నంబర్ 50 సమ్మక్క అనే మహిళకు దక్కినట్లు అధికారులు ప్రకటించారు.

News November 3, 2025

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా: కాకాణి

image

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలానికి చెందిన వైసీపీ నేత గోపాల్ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతూ ఉండగా అతడిని పరామర్శించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న గోపాల్ దంపతులపై విచక్షణరహితంగా దాడి చేసి, గోపాల్ గొంతు కోశారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన అన్నారు.