News March 22, 2025

సిద్దిపేట: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: సీపీ

image

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట రూరల్ సర్కిల్, దుబ్బాక సర్కిల్ పోలీస్ అధికారులతో పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు.

Similar News

News October 25, 2025

సుంకేసుల బ్యారేజీకి భారీ వరద..!

image

కర్ణాటకలో కురిసిన వర్షాలు, వాగులు వంకల ద్వారా వచ్చి చేరిన నీటితో రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుంది. శనివారం బ్యారేజీకి 70,200 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో అధికారులు జలాశయం 16 గేట్లు ఎత్తి 67,916 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కేసీ కెనాల్‌కు 1,930 క్యూసెక్కులు, మొత్తం 69,846 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి వదులుతున్నారు.

News October 25, 2025

‘యుద్ధం చేస్తాం’.. అఫ్గాన్‌కు పాక్ వార్నింగ్

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు ఓ కొలిక్కి రాలేదు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా మహ్మద్ ఆసిఫ్ యుద్ధం చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ‘మాకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎలాంటి ఒప్పందం జరగకపోతే వారిపై యుద్ధం చేస్తాం. కానీ, వాళ్లు శాంతి కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’ అని ఖవాజా చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

News October 25, 2025

కడప జిల్లాకు రెడ్ అలెర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో JC అదితి సింగ్, జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
కడప కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08562-246344
కడప ఆర్డీవో కార్యాలయం: 08562-295990
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 95028 36762
బద్వేలు ఆర్డీవో కార్యాలయం: 6301432849
పులివెందుల ఆర్డీవో కార్యాలయం: 8919134718