News March 22, 2025

విశాఖ: కారుణ్య నియామక పత్రాలు అందించిన కలెక్టర్

image

ఏపీఎస్‌ ఆర్టీసీలో పని చేస్తూ చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యులకు శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ శాఖలలో కారుణ్య నియామక పత్రాలు అందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఉన్నారు.

Similar News

News March 25, 2025

విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

image

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

News March 25, 2025

జీవీఎంసీలో ఏ కార్పొరేటర్‌పైనా ఒత్తిడి తేలేదు: MLC పిడుగు

image

జీవీఎంసీ మేయర్ పీఠం కోసం ఏకార్పొరేటర్ పైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని జనసేన MLC పిడుగు హరిప్రసాద్ అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని కార్పొరేటర్లు గ్రహించారని దీంతో వారంతా మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అధికార బలంతో గతంలో జీవీఎంసీలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన.. వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.

News March 25, 2025

విశాఖలో 15 మందిపై పీడీ యాక్ట్..!

image

విశాఖ సిటీలో రౌడీ షీటర్ల ఆగడాలు నివారించేందుకు విశాఖ సీపీ కఠిన చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి వివరాలు సేకరిస్తూనే పలువురుపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. తాజాగా సీతంపేట, కొబ్బరితోట ప్రాంతాలకు చెందిన వై.కుమార్, వై.ఎర్రన్నలపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయగా.. వీరిద్దరితో ఆ సంఖ్య 15కు చేరింది.

error: Content is protected !!