News March 22, 2025
కృష్ణా: 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% హాజరు

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
Similar News
News March 25, 2025
తాడేపల్లిలో వివాహిత దారుణ హత్య (అప్డేట్)

తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి లక్ష్మీ తిరుపతమ్మ (పామర్రుకు చెందిన వివాహిత) హత్యకు గురైన విషయం తెలిసిందే. లక్ష్మీ తిరుపతమ్మతో సన్నిహితంగా ఉండే బిహార్‌కు చెందిన కార్మికులు హత్య చేసినట్లు ఆమె సోదరుడు ఆరోపించాడు. పోలీసులు లక్ష్మీ తిరుపతమ్మ స్నేహితురాలిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోమవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు.
News March 25, 2025
MTM: అర్జీల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు.
News March 24, 2025
కృష్ణా: ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు- DRO

ఈ నెల 25వ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ చంద్రశేఖరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పెడనలో 1, పెనమలూరులో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.