News March 22, 2025
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

వ్యవసాయం, మత్స్య సంపద ఉత్పత్తుల విస్తీర్ణంతో ఆదాయం వృద్ధి అయ్యే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 10.70శాతం లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు.
Similar News
News March 25, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మూడో విడత కలెక్టర్ల సదస్సు మంగళవారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. విశాఖ జిల్లా అభివృద్ధి, పీ-4 సర్వే పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.
News March 25, 2025
డీలిమిటేషన్‌పై TDP MLA కీలక వ్యాఖ్యలు

AP: డీలిమిటేషన్‌లో భాగంగా జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని చెప్పారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఎన్డీఏ భాగస్వాములం కాబట్టి దీనిపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 25, 2025
కొలీజియాన్ని రద్దు చేసే NJAC అంటే ఏంటి…

జడ్జిల నియామక వ్యవస్థే కొలీజియం. ఇందులో CJI సహా కొందరు జడ్జిలు ఉంటారు. వీరు ఎంపిక చేసిన పేర్లనే కేంద్రం ఆమోదించాలి. దీంట్లో GOVT, MPల జోక్యం ఉండదు. 2014లో మోదీ ప్రభుత్వం NJAC (నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్) చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో CJI, ఇద్దరు జడ్జిలు, SC/ST, OBC నుంచి ఇద్దరు ప్రముఖులు (PM, LOP ఎంపిక చేస్తారు), న్యాయ మంత్రి ఉంటారు. NJAC రాజ్యాంగ విరుద్ధమని 2016లో SC కొట్టేసింది.