News March 22, 2025
ఇన్‌స్టా లైవ్‌లో భర్త ఉరి.. వీడియో చూసినా పట్టించుకోని భార్య

మధ్యప్రదేశ్ రేవా(D)లో అమానవీయ ఘటన జరిగింది. భార్య, అత్త వేధింపులు తాళలేక శివ్ ప్రకాశ్(26) అనే యువకుడు ఇన్‌స్టా లైవ్‌లో ఉరివేసుకున్నాడు. అతని భార్య ప్రియాశర్మ 44 ని.లపాటు వీడియో చూస్తున్నా సాయం చేయడానికి ప్రయత్నించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భార్య, అత్తను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాశర్మకు ఉన్న వివాహేతర సంబంధం వల్లే భర్తతో విభేదాలు వచ్చాయని, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
Similar News
News February 16, 2026
సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.
News February 16, 2026
హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత క్షమాపణలు

హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత నాగేంద్రన్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె గురించి అలా మాట్లాడి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు. త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే టీవీకే చీఫ్ విజయ్‌కు వాస్తవాలు తెలుస్తాయంటూ ఆయన ఇటీవల <<19157644>>వ్యాఖ్యానించిన<<>> విషయం తెలిసిందే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష హెచ్చరించడంతో నాగేంద్రన్ దిగివచ్చారు.
News February 16, 2026
INDvsPAK.. రికార్డు బ్రేకింగ్ వ్యూస్!

కొలంబో వేదికగా IND-PAK మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులు బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను అభిమానులు మొబైల్ ఫోన్స్, టీవీల్లో లైవ్ వీక్షించి ఆనందించారు. అలాగే INDvsUSA మ్యాచ్‌కు 26 కోట్లు, INDvsNAM మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి.


