News March 22, 2025

విశాఖ: పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందికి బదిలీలు

image

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందిని బదిలీ చేస్తూ సీపీ శంకబద్ర బాచి ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఏఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. భీమిలి ఏఎస్ఐ ఎం సింహాచలంను ఆనందపురానికి, సీఎస్‌బి నుంచి చంటి కుమారును ఆరిలోవకు, సీఎస్‌బీ నుంచి శివరామకృష్ణును వన్‌టౌన్‌కు బదిలీ చేశారు.

Similar News

News March 25, 2025

విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

image

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

News March 25, 2025

విశాఖ: ఫ్రీ పార్కింగ్.. ఏప్రిల్ 1 నుంచి అమలు

image

విశాఖలోని వాణిజ్య సముదాయలు, మాల్స్, మల్టీప్లెక్సుల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజును వసూలు చేయరాదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వాణిజ్య సముదయాలలో వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చూపిస్తే 30 నిముషాలు, మల్టిఫ్లెక్స్‌లో సినిమా టికెట్ చూపిస్తే గంటసేపు పార్కింగ్ చేసుకోవచ్చుని ఉత్తర్వులలో పేర్కోంది.

News March 25, 2025

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మూడో విడత కలెక్టర్ల సదస్సు మంగళవారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. విశాఖ జిల్లా అభివృద్ధి, పీ-4 సర్వే పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.

error: Content is protected !!