News March 25, 2024
ఏప్రిల్ 28న TSRDC CET

TSRDC CET-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు వెల్లడించారు. ఈ పరీక్షకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన వారు అర్హులని, ఏప్రిల్ 12లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 21 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.
Similar News
News January 22, 2026
వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

చర్మంపై చాలా చిన్నగా తెల్లని మచ్చల్లా ఉండే వైట్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * రెండు చెంచాల ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగెయ్యాలి. * చెంచా వంటసోడాలో కాసిని నీళ్లు కలిపి వైట్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తోంటే అధిక జిడ్డు పోవడమే కాదు, వైటెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది.
News January 22, 2026
గులాబీలో చీడల నివారణకు సూచనలు

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.
News January 22, 2026
జనసేనపై కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్

AP: జనసేనపై జరుగుతున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ‘ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, కుల విభేదాలను జనసేనకు ఆపాదించాలని కొందరు కిరాయి వక్తలు, మాధ్యమాలు కుట్రలు పన్నుతున్నాయి. వివాహేతర సంబంధాల రచ్చను కూడా రుద్దాలని చూస్తున్నాయి. అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ సూచించినట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.


