News March 22, 2025
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
Similar News
News January 12, 2026
ప్రకాశం SP ‘మీకోసం’కు 58 ఫిర్యాదులు

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం SP మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. SP కార్యాలయం ఈ వివరాలను ప్రకటించింది.
News January 12, 2026
ప్రకాశం జిల్లాకు లేడీ ఆఫీసర్.. నేపథ్యం ఇదే.!

ప్రకాశం జిల్లా జేసీగా నియమితులైన <<18835611>>కల్పనా కుమారి<<>> ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2018 బ్యాచ్ IASగా ఎంపికయ్యారు. ఈమె సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, విశాఖపట్నం JCగా, నంద్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం గిరిజన సహకార సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె స్వస్థలం ఢిల్లీ కాగా, ఐఏఎస్‌కు ముందు ఇంజినీర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
News January 12, 2026
ఒంగోలు: వివేకానంద సేవలు ఎనలేనివి

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు తదితరులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద తన రచనల ద్వారా యువతకు మార్గదర్శకత్వం చేశారన్నారు.


