News March 22, 2025
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: ఏపీ స్టేట్ క్రియేటివిటీ&కల్చర్ కమిషన్

విజయవాడ: కళాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న “అమరావతి చిత్రకళావీధి” కార్యక్రమం కోసం ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలని ఏపీ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఛైర్‌పర్సన్ పి. తేజస్వి కోరారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 4న రాజమండ్రిలో జరిగే ఈ కార్యక్రమం కోసం కళాకారులు https://www.amaravathiartfestival.com/లో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 28, 2025
పెనగలూరు: అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు

పెనగలూరు మండలం, ఓబిలి గ్రామానికి చెందిన బుర్రకట్ల మహేశ్వరయ్యను ఇనుప రాడ్డుతో తలపై మోది చంపిన తమ్ముడు బుర్రకట్ల ఈశ్వరయ్య చంపాడు. ఈకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జి గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరం జనవరి నెలలో నేరం చేసిన ముద్దాయికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయింది. కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.
News March 28, 2025
రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం(రేపు) కొడంగల్‌లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. సాయంత్రం ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News March 28, 2025
నాయుడుపేటలో బాలికపై అత్యాచారయత్నం.. ఐదేళ్లు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో వెంకయ్య అనే వ్యక్తికి నాయుడుపేట కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.22,000 జరిమానా విధించింది. నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక ఆడుకుంటుండగా 2019లో వెంకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అదే రోజు వెంకయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పొక్సో కోర్టు న్యాయమూర్తి సుమ నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష ఖరారు చేశారు.