News March 22, 2025

మిషన్ వాత్సల్య పథకానికి అర్హుల జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. మిషన్ వాత్సల్య పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 28, 2025

కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

image

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.

News October 28, 2025

నిర్మల్: ‘పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

నిర్మల్ జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీసీఐ సమయానికి కొనుగోళ్లు ప్రారంభించి రైతుల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

News October 28, 2025

CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.