News March 22, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.
Similar News
News March 25, 2025
రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

AP: రేపు రాష్ట్రంలోని <
News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.
News March 25, 2025
దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.