News March 22, 2025

ములుగు జిల్లాకే తల మాణికం రామప్ప చెరువు!

image

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు జిల్లాకే తలమానికం అని చెప్పవచ్చు. సుమారు 6000 ఎకరాల్లో పంటలకు సాగునీరు నందిస్తూ, నాలుగు మండలాలకు తాగునీరును అందించడమే కాక ఈ సరస్సులోని నీటిని గణపసముద్రం, పాకాల సరస్సులకు తరలిస్తున్నారు. రామప్ప సరస్సును రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది. (నేడు ప్రపంచ జల దినోత్సవం)

Similar News

News November 9, 2025

‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్‌లో చూసి..

image

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.

News November 9, 2025

NZB: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా: కవిత

image

విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు.

News November 9, 2025

జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.