News March 22, 2025
కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.
Similar News
News March 25, 2025
IPL-2025: పాపం.. మ్యాక్స్‌వెల్

GTతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ తొలి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరారు. సాయికిశోర్ వేసిన బంతి నేరుగా వికెట్లను తగులుతున్నట్లు కనిపించడంతో అంపైర్ LBW ఇవ్వగా మ్యాక్సీ రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత రీప్లే చూస్తే బాల్ స్టంప్స్‌ను మిస్ అయినట్లు కనిపించింది. దీంతో మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకొని ఉండాల్సిందని.. మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయినా చెబితే బాగుండేదని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
News March 25, 2025
29న పార్లమెంట్ సమావేశాలు రద్దు

ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. గత వారం హోలీకి ముందు రోజు సెలవు ఇవ్వడంతో ఈ నెల 29న కార్యకలాపాలు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ పేర్కొంది. ఆ రోజు యథాతథంగా సెలవు ఉంటుందని తెలిపింది.
News March 25, 2025
OTTలోకి సందీప్ కిషన్ ‘మజాకా’

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.