News March 23, 2025

నటుడి సూసైడ్ కేసు: CBI సంచలన నిర్ణయం!

image

యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు సంబంధించి 2 కేసులను CBI మూసేసినట్టు తెలిసింది. అతడి మరణం వెనుక కుట్ర జరిగిందనడానికి ఆధారాలేమీ దొరకలేదని ముంబై కోర్టుకు రిపోర్టులు సమర్పించినట్టు సమాచారం. రియా చక్రబర్తి సహా కొందరు ఆర్థికంగా, మానసికంగా వేధించడంతోనే SSR చనిపోయాడని అతడి తండ్రి కేకే సింగ్ 2020, ఆగస్టులో FIR నమోదు చేయించారు. కాగా SSR మాజీ మేనేజర్ దిశ మృతి కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

Similar News

News March 25, 2025

29న పార్లమెంట్ సమావేశాలు రద్దు

image

ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. గత వారం హోలీకి ముందు రోజు సెలవు ఇవ్వడంతో ఈ నెల 29న కార్యకలాపాలు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ పేర్కొంది. ఆ రోజు యథాతథంగా సెలవు ఉంటుందని తెలిపింది.

News March 25, 2025

OTTలోకి సందీప్ కిషన్ ‘మజాకా’

image

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

News March 25, 2025

డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మృతి

image

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్‌మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.

error: Content is protected !!