News March 23, 2025
పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

KKRతో మ్యాచులో పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను RCB బెంచ్‌కే పరిమితం చేసింది. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే SRHలో ఉండుంటే డగౌట్లో కూర్చునే పరిస్థితి రాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ దశాబ్దానికిపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
Similar News
News October 16, 2025
రిజర్వేషన్లు 50% మించొద్దనడం సరికాదు: సింఘ్వీ

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తక్షణం జోక్యం చేసుకోవాలని TG తరఫున సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచామని, రిజర్వేషన్లు 50 శాతం మించరాదనడం సరికాదని వాదించారు.
News October 16, 2025
ట్రాఫిక్‌లోనే జీవితం అయిపోతోంది!

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పెరిగిపోయింది.
News October 16, 2025
ఎల్లుండి బంద్.. స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయా?

TG: బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నెల 18న బంద్ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగైతే స్కూళ్లు, కాలేజీలకు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.