News March 25, 2024
జియ్యమ్మవలస: గవరమ్మపేటలో ఏనుగులు

జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజుపురం, గవరమ్మపేట గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏనుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News March 14, 2026
VZM: సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం.. మోసపోతే ప్రశ్నించండి

వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
News March 14, 2026
VZM: పోక్సో కోర్టులో ఈనెల 31న మొబైల్ ఫోన్ల వేలం

విజయనగరం జిల్లా పోక్సో కోర్టులో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రభుత్వం జప్తు చేసిన మొబైల్ ఫోన్లను ఈ నెల 31న బహిరంగ వేలం వేయనున్నట్లు కోర్టు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31 సాయంత్రం 4:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.