News March 23, 2025
టీబీ రహిత సమాజానికి కృషి చేద్దాం: VZM కలెక్టర్

టీబీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శనివారం తమ చాంబర్‌లో క్షయ వ్యాధి అవగాహనకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.జీవన రాణి పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్

విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేడ్కర్ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు గురించి చర్చించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి, వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.
News March 25, 2025
నెల్లిమర్ల: నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. నెల్లిమర్ల MIMSలో నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
News March 25, 2025
బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.