News March 23, 2025
తుని: భక్తులు అభిప్రాయాలను క్యూఆర్ కోడ్‌తో స్వీకరణ

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏపీ దేవాదాయ శాఖ క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టింది. ఈ చర్యలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో శనివారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథ రాజు QR కోడ్ బోర్డులను ఆవిష్కరించబడింది.ఈ QR కోడ్ ద్వారా భక్తులు తమ దర్శన అనుభవాన్ని, ఆలయ సౌకర్యాలపై అభిప్రాయాలను నేరుగా అధికారులకు తెలియపరచవచ్చు అని ఈవో తెలిపారు.
Similar News
News July 4, 2025
KNR: 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ల సస్పెండ్

కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను మేనేజ్మెంట్ సస్పెండ్ చేసింది. డాక్టర్స్ డే రోజు జరిగిన కార్యక్రమంలో తమ పెండింగ్ స్టైఫండ్ నిధులను రిలిజ్ చేయాలని నిరసన వ్యక్తం చేసినందుకే తమని సస్పెండ్ చేశారని విద్యార్థులు వాపోయారు.
News July 4, 2025
అనకాపల్లి జిల్లాలో పార్కు నిర్మాణానికి ఆమోదం

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో రూ.5 కోట్లతో సుమారు 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు. వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో <<16943032>>అపార్ట్మెంట్లు<<>> నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.
News July 4, 2025
ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు యువకుల మృతి

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం నెలకొంది. చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో వాగులో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.