News March 25, 2024

నంద్యాల జిల్లాలో రెండో మహిళా అభ్యర్థిగా బైరెడ్డి శబరి

image

నంద్యాల TDP MP అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరగగా.. స్వతంత్ర అభ్యర్థి శేషగిరి రావు కాంగ్రెస్ అభ్యర్థి NR రెడ్డిపై 6,604 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో TDP తరఫున పోటీ చేసిన భూమా శోభానాగిరెడ్డి, నియోజకవర్గం నుంచి తొలి మహిళా MP అభ్యర్థిగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో శబరి పోటీ చేయనుండటంతో నంద్యాల నుంచి రెండో మహిళా ఎంపీ అభ్యర్థిగా నిలుస్తారు.

Similar News

News December 27, 2025

ఉగాది లోపు పెండింగ్ ఇళ్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆప్షన్–3 కింద నిర్మాణంలో ఉన్న 10,034 ఇళ్లలో పెండింగ్‌లో ఉన్న 6వేల ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో హౌసింగ్ పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 4,794 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 2,522 ఇళ్లలో లోపాలు గుర్తించామని తెలిపారు. వాటిలో 868 ఇళ్ల లోపాలు సరిచేశామని, మిగిలినవన్నీ వారంలోపు పూర్తి చేయాలన్నారు.

News December 27, 2025

కర్నూలు జిల్లాలో డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ.!

image

జనవరి 1, 2026న పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముందుగానే డిసెంబర్ 31వ తేదీన వందశాతం లబ్ధిదారులకు అందజేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, పెన్షన్ పంపిణీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 30న పెన్షన్ మొత్తాన్ని డ్రాచేసి సేఫ్ కస్టడీలో ఉంచుకుని, 31 ఉదయం 6.30 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని తెలిపారు.

News December 27, 2025

21,033 మంది శక్తి యాప్‌ డౌన్‌లోడ్: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై శక్తి టీమ్‌లు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, డయల్ 112, 1930 వంటి సేవల వినియోగంపై విద్యార్థినులకు వివరించామన్నారు. జనవరి నుంచి డిసెంబర్ 27 వరకు జిల్లాలో 21,033 మంది శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.