News March 23, 2025
డిచ్‌పల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిచ్‌పల్లి SBI గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ సుంకేం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణకు 19 నుంచి 45 సంవత్సరాలు లోపు NZB, కామారెడ్డికి జిల్లాలకు చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 17, 2026
నిజామాబాద్‌లో సైబర్ మోసం

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News January 17, 2026
NZB: మందుగుండు పేలి ఆవు మృతి

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.
News January 17, 2026
NZB: ఆశవాహుల్లో ఉత్కంఠ

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.


