News March 23, 2025

HYD: ‘నెట్ వర్కింగ్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

యువత నెట్ వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏఐ డేటా ఫెస్ట్ ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామిక డేటా నిపుణులు ధావల్ పటేల్ సూచించారు. ఏఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలో విద్యార్థులకు, యువతకు నెట్ వర్కింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐ డేటా సైన్స్ అనలిటిక్స్‌లో పురోగతులను పరిశోధించడానికి మంచి ఫ్లాట్ ఫారం లా ఇలాంటి వర్క్ షాపులు దోహద పడతాయన్నారు.

Similar News

News November 11, 2025

జడ్చర్ల: దొంగ నోట్లను గుర్తించండిలా..!

image

జడ్చర్లలో దొంగనోట్ల చలామణి కేసులో నలుగురిని అరెస్టు చేయడంతో మార్కెట్‌లో నకిలీ నోట్లపై అప్రమత్తత ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు నోటును గుర్తించేందుకు గాంధీ చిత్రం, వాటర్‌మార్క్, భద్రతా దారం, ఆప్టికల్ వేరియబుల్ ఇంక్‌లను పరిశీలించాలి. నకిలీ నోట్లలో ఇవి మసకబారి, నాణ్యత లేకుండా ఉంటాయి. అనుమానం వస్తే వెంటనే బ్యాంకులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.

News November 11, 2025

శబరిమలకు అద్దె బస్సులు

image

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్‌లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.