News March 23, 2025
RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

IPL2025 తొలి మ్యాచులో KKRపై విజయం సాధించిన RCBకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా X వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఎట్టకేలకు ఆర్సీబీ బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన మాల్యా ప్రస్తుతం UKలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 26, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 26, 2025
శుభ ముహూర్తం (26-03-2025)

☛ తిథి: బహుళ ద్వాదశి రా.10.37 వరకు తదుపరి త్రయోదశి
☛ నక్షత్రం: ధనిష్ఠ రా.11.53 వరకు తదుపరి శతభిషం
☛ శుభ సమయం: లేదు
☛ రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
☛ యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
☛ వర్జ్యం: లేదు
☛ అమృత ఘడియలు: మ.1.43 నుంచి మ.3.15 వరకు
News March 26, 2025
IPL: లక్నోకు గుడ్ న్యూస్!

లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్. రెండో మ్యాచులో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ఆ జట్టుతో చేరనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఎల్లుండి SRHతో జరిగే మ్యాచులో ఆడతారని పేర్కొన్నాయి. అవేశ్ ఫిట్‌గా ఉన్నట్లు క్లియరెన్స్ వచ్చిందని వెల్లడించాయి. మోకాలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచులో ఆడలేదు.