News March 23, 2025
సంగారెడ్డి: నేటితో ముగియనున్న గడువు: డీఈవో

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారు నిర్వహిస్తున్న యువికాలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుందని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇస్రో వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
నేనలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: డీకే

ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగాన్ని మారుస్తామని తాను అనలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘ముస్లింలకు కోటా కల్పించడానికి రాజ్యాంగాన్ని మార్చగల “మంచి రోజు” రావచ్చు’ అని ఇటీవల ఓ కార్యక్రమంలో డీకే వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం మొదలైంది.
News March 26, 2025
సంగారెడ్డి: మొబైల్ సైన్స్ ప్రయోగశాల కోసం టెండర్ల ఆహ్వానం

సంగారెడ్డి జిల్లాలో మొబైల్ సైన్స్ ప్రయోగశాల ఏర్పాటు కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధిత విషయాల వారీగా మెటీరియల్, ఎక్విప్మెంట్ సరఫరా కొరకు సంబంధిత ఏజెన్సీల నుంచి టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News March 26, 2025
వరంగల్: అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరాకు టెండర్

వరంగల్ జిల్లాలోని 670 అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి తెలిపారు. నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు 2025 ఏప్రిల్ నుంచి మార్చి 2026 సంవత్సరం వరకు సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈనెల 28లోగా దరఖాస్తులు అందచేయాలని మరిన్ని వివరాల కోసం జిల్లా సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.