News March 23, 2025

KMR: అప్పులు తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్య

image

సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన సుంకరి శంకర్(51) కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులు చేసి తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. శంకర్ బిచ్కుంద మండలం నీరడిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

HNK: ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ దందా!

image

జీతం తీసుకునేది ప్రభుత్వం దగ్గర.. చేసేది ప్రైవేట్‌లో దందా. పేరుకు ప్రభుత్వ వైద్యులుగా చలామణి అవుతూ HNK నడిబొడ్డులో డయాగ్నోస్టిక్ పేరుతో ఏళ్ల తరబడి దందా కొనసాగిస్తున్నారు. ముగ్గురు వైద్యులు డ్యూటీకి ఎగనామం పెడుతూ, నిత్యం పరీక్ష రిపోర్టులపై సంతకాలు చేస్తూ రూ.కోట్లు కూడబెడుతున్నారు. నిఘా పెట్టాల్సిన జిల్లా అధికారులకు మామూళ్లు ఇస్తుండటంతో వారిపై పెన్ను పెట్టే సాహసం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

News February 28, 2026

చిత్తూరు పోలీసులకు అవార్డులు

image

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరు అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్ఐ రవి, చిత్తూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పలమనేరు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ లీలాసుఖ నాయుడు, చిత్తూరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, రాళ్లబూదుగూరు హెడ్ కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.

News February 28, 2026

₹25 వేల కోట్ల స్కామ్‌లో క్లీన్ చిట్: ‘BJP వాషింగ్ మెషీన్’ విమర్శలు

image

మహారాష్ట్ర రాజకీయాల్లో ₹25 వేల కోట్ల MSCB స్కామ్ కేసు క్లోజ్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎలాంటి అక్రమాలు జరగలేదన్న EOW రిపోర్టును ముంబై కోర్టు ఆమోదించింది. దీంతో దివంగత అజిత్ పవార్ BJP కూటమిలో ఉండటం వల్లే క్లీన్ చిట్ వచ్చిందంటూ ప్రతిపక్షాలు ‘BJP వాషింగ్ మెషీన్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. రాజకీయ అవసరాల కోసమే పవార్ కుటుంబంపై ఉన్న కేసులను మాఫీ చేశారని విమర్శకులు మండిపడుతున్నారు.