News March 23, 2025

NZB: మునగ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

మునగ చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్ఐ అరాఫత్ అలీ తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(56) ఈ నెల 18వ తేదీన పని కోసం బయటకు వెళ్లాడు. అనంతరం ఓ మునగ చెట్టు కనపడడంతో దానిపైకి ఎక్కిగా చెట్టు విరిగి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరాకు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 11, 2025

వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

image

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

News July 11, 2025

NZB: ముందుందిలే మనకు మంచికాలం..!

image

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మెుదలైంది. కొన్నిరోజులుగా కృష్ణానది పరుగులిడుస్తుంటే..గోదారమ్మ వెలవెలబొయింది. కాగా గత మూడు రోజులుగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామసాగర్‌కు ప్రాజెక్టు వరదనీరు వచ్చిచేరుతోంది. గతేడాది ఇదే సమయానికి 12.440 టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది 20.138 టీఎంసీల నీరు ఉంది. 4309 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

News July 11, 2025

NZB: తెలంగాణ ఇంజినీర్స్ డే.. మన ప్రాజెక్టులకు రూపశిల్పి ఆయనే

image

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజినీర్స్ డే జరుపుకుంటాం. అలాగే తెలంగాణలో అంతటి మేధావి, సమకాలికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని ప్రభుత్వం జూలై11ను ‘తెలంగాణ ఇంజనీర్స్‌డే’ గా నిర్వహిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు, పొచారం ప్రాజెక్టు, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం బోధన్ నిజాంషుగర్స్ ఈయనే నిర్మించారు. కాగా అలీసాగర్ జలాశయానికి ఈయన పేరునే పెట్టారు.