News March 23, 2025
పైరవీలు లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: భట్టి

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను పైరవీలు లేకుండా, పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను Dy.CM భట్టి విక్రమార్క ఆదేశించారు. APR 5లోగా దరఖాస్తులు స్వీకరించి, APR 6 నుంచి మండల స్థాయిలో స్క్రూటినీ, ఆ తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్ వచ్చాక లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. JUNE 2 నుంచి మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు.
Similar News
News March 26, 2025
ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.
News March 26, 2025
అర్జున్ టెండూల్కర్‌ను బెస్ట్ బ్యాటర్‌గా మారుస్తా: యువరాజ్ తండ్రి

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను తాను 6 నెలల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తయారు చేస్తానని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. ‘అర్జున్ బౌలింగ్‌పై టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అతడిలో బౌలింగ్ కంటే బ్యాటింగ్ సామర్థ్యమే ఎక్కువ. నా దగ్గర ట్రైనింగ్‌కి వస్తే బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతా. నా దగ్గర 12days శిక్షణ తీసుకుని రంజీ అరంగేట్రంలో అతడు సెంచరీ చేశాడు. ఎవరైనా గ్రహించారా?’ అని గుర్తుచేశారు.
News March 26, 2025
రాష్ట్రవ్యాప్తంగా ULBల్లో ఓటీఎస్ అమలు

TG: జీహెచ్ఎంసీతో సహా అర్బన్ లోకల్ బాడీ(ULB)ల్లో ఆస్తి పన్నుపై వడ్డీ చెల్లింపునకు ‘వన్ టైం సెటిల్‌మెంట్(OTS)’ పథకాన్ని పురపాలక మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీలపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.