News March 23, 2025
కల్వకుర్తి: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

కల్వకుర్తి ఈనెల 25న తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాపోతు అనిల్ గౌడ్ పేర్కొన్నారు. పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు 5వేల ఉద్యోగాలు కల్పించనున్నాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్‌ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News November 5, 2025
MDK: వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ ❤️

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద కార్తీక పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో వనదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఒకే ఫ్రేమ్‌లోకి చంద్రుడు, ఆలయం, అమ్మవారి విగ్రహం రావడంతో ఈ సుందర దృశ్యాన్ని భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.


