News March 23, 2025
ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్‌గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.
Similar News
News March 26, 2025
రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్

IPLలో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచులోనే 90+ స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచారు. 2018లో DC తరఫున KKRపై 93, నిన్నటి మ్యాచులో GTపై 97 రన్స్ చేశారు. అతను సెంచరీని త్యాగం చేసి శశాంక్ సింగ్‌ను షాట్స్ ఆడమని చెప్పడం వల్ల చివరి ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. ఆ పరుగులే మ్యాచ్ చివర్లో కీలకంగా మారాయి. ఫలితంగా 11 రన్స్ తేడాతో PBKS విన్ అయింది.
News March 26, 2025
ఆన్‌లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం

AP: నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు CM చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. ‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. YS వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
News March 26, 2025
IPL: టేబుల్ టాపర్‌గా SRH

IPL-2025లో ఇప్పటివరకు 5 మ్యాచులు పూర్తవగా, ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 5 జట్లు (SRH, RCB, PBKS, CSK, DC) విజయం సాధించగా, మిగతా 5 జట్లు (LSG, MI, GT, KKR, RR) ఓటమిని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH తొలి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా RCB, PBKS, CSK, DC, LSG, MI, GT, KKR, RR ఉన్నాయి.