News March 23, 2025

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి 

image

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే  అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

Similar News

News March 26, 2025

త్వరలోనే కాకాణి అరెస్ట్.?

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిన జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆయనపై పలు కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతున్నా.. ప్రజా ప్రతినిధుల తీరును తప్పుబడుతున్నా కేసులు నమోదు చేస్తున్నారంటూ వాపోయారు. తాను కేసులు, జైళ్లకు భయపడే రకం కాదని కాకాణి ఇప్పటికే స్పష్టం చేశారు.

News March 26, 2025

నెల్లూరు జిల్లాలోని HM, టీచర్లకు గమనిక 

image

నెల్లూరు జిల్లాలోని ZP ప్రభుత్వ మున్సిపాలిటీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28వ తేదీలోగా తెలియజేయాలని డీఈఓ డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్‌సైట్‌, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉందన్నారు.

News March 26, 2025

నెల్లూరు:నెలాఖరు వరకు ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ

image

ఆస్తి పన్ను పై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు తోడు పేరుకుపోయిన కోట్లాది రూపాయల మొండిబకాయిల వసూళ్ల కోసం రాయితీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

error: Content is protected !!