News March 23, 2025
విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: షీ టీం ఎస్ఐ సునంద

మహబూబాబాద్ జిల్లా సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మహిళా ఫార్మసీ కళాశాలలో షీ టీం ఎస్ఐ సునంద పలు విషయాలపై శనివారం అవగాహన కల్పించారు. నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. జాగ్రత్తగా మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News March 27, 2025
వనపర్తి: మృతిపై అనుమానం.. అంత్యక్రియలు నిలిపివేత..!

ఓ వ్యక్తి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం వాసి కృష్ణయ్య(42) మృతిచెందాడు. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అతడి మోకాళ్ల వద్ద గాయాలు,శరీరం మొత్తం ఉబ్బి ఉండడం గమనించిన బంధువులు దహన సంస్కారాలను నిలిపివేశారు. ఈవిషయమై మృతుడి చిన్నాన్న వెంకన్న PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాడీని జిల్లా మార్చురీకి తరలించామని SIసురేశ్ తెలిపారు.
News March 27, 2025
ఖమ్మం: కేసీఆర్ పాలనలో రైతులకు మేలు: నిర్మలమ్మ

బుధవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం KCR రైతులకు రూ.లక్ష రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేసి వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని వివరించారు. కాగా, దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా స్పందిస్తూ.. కేసీఆర్ పాలనలో రైతులు, వ్యవసాయ రంగానికి మేలు జరిగిన మాట నిజమేనన్నారు. అయితే, కాంగ్రెస్ 2008-09లో రైతు రుణ మాఫీ గురించి హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు.