News March 23, 2025
NLG: బర్డ్ ఫ్లూ ఉద్ధృతి.. 52 RRT బృందాల ఏర్పాట్లు

ఉమ్మడి NLG జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వ్యాధి ఉద్ధృతి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (RRT) ఏర్పాటు చేసింది. కోళ్ల శాంపిల్స్ సేకరించేందుకు వీరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాగా గుండ్రాంపల్లి, నేలపట్ల, దోతిగూడెం గ్రామాల్లో వేలకొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్‌ను అధికారులు ఇప్పటికే పూడ్చారు. ఆ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు.
Similar News
News February 28, 2026
నల్గొండ: సీఎంఆర్ అక్రమాల్లో లీకుల కలకలం!

జిల్లాలో సీఎంఆర్ అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల రాకపై ముందస్తు సమాచారం అందడంతో మిల్లర్లు ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేసి పరారయ్యారు. కేసులు నమోదైన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్ కాపీలు నిందితులకు చేరడం, వారు వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాఖా పరమైన లీకులపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
News February 28, 2026
నల్గొండ: పంచాయతీ నిధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కలెక్టర్ కార్యాలయం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని ఆదేశించింది. బేసిక్ గ్రాంట్లను 29 రకాల అభివృద్ధి పనులకు (జీతాలు మినహా) వాడవచ్చని తెలిపింది. టైడ్ గ్రాంట్లలో 50% పారిశుధ్యానికి, 50% తాగునీటి సరఫరాకు కేటాయించాలని పేర్కొంది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాధాన్యత క్రమంలో మార్చి 5, 2026 లోపు చెల్లించాలన్నారు.
News February 28, 2026
నల్గొండ: పంచాయతీల్లో ‘ఫైనాన్స్’ సెగ!

జిల్లాలోని GPలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైన నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2 విడతలుగా జిల్లాకు సుమారు రూ.33.25 కోట్ల గ్రాంట్లు మంజూరవగా, ఆ నిధుల ఖర్చు విషయంలో ఇరువర్గాల మధ్య మనస్పర్థలు తీవ్రమవుతున్నాయి. గతంలో చేసిన పనులకు సంబంధించి కొందరు తక్కువ ఖర్చు చేసి, ఇప్పుడు రికార్డుల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చులు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.


