News March 23, 2025

కానూరులో వ్యభిచార గృహంపై దాడి

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Similar News

News March 26, 2025

కొడాలి నానికి ఎటువంటి అనారోగ్య సమస్య లేదు: దుక్కిపాటి

image

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో హాస్పిటల్లో జాయిన్ అయినా కొడాలి నానికి అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యం సవ్యంగా ఉన్నట్లు రిపోర్ట్‌లు వచ్చాయని చెప్పారు. ఆయనకు గుండెపోటు అని మీడియాలో వస్తున్న కథనాలు ఆవాస్తమని ఆయన ఖండించారు. 

News March 26, 2025

కృష్ణా: పొట్టిపాడు టోల్ గేట్ వద్ద గంజాయి పట్టివేత 

image

ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనకాపల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్న కారును తనిఖీ చేయగా, 62 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

News March 26, 2025

మూడో స్థానంలో కృష్ణా జిల్లా

image

కృష్ణా జిల్లా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 87,742 కోట్లు జీడీడీపీ నమోదు చేయగా, గత రెండేళ్లతో పోల్చితే 11.58% వృద్ధి సాధించింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో నిలకడగా ఎదుగుతోంది. మాంసం, రొయ్యల ఉత్పత్తి, మైనింగ్, విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ మెరుగైన ప్రగతి కనబరిచింది. స్తుల దేశీయోత్పత్తిలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మూడో స్థానంలో నిలిచింది.

error: Content is protected !!