News March 23, 2025
మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు

AP: మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ACB కేసు నమోదు చేసింది. YCP హయాంలో 2020 సెప్టెంబర్‌లో పల్నాడు (D) యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
Similar News
News March 27, 2025
మీ ఫోన్‌పే, గూగుల్‌పే పని చేస్తున్నాయా?

నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని SMలో పోస్టులు పెట్టారు. మరి మీ యూపీఐ పేమెంట్స్ పనిచేస్తున్నాయా? కామెంట్ చేయండి.
News March 27, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

AP: చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
News March 27, 2025
రుణమాఫీ వల్ల రైతులు అటూ ఇటూ కాకుండా పోయారు: నిర్మల

తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అయిందని చెప్పడంతో నష్టం జరుగుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ‘దీనివల్ల బ్యాంకులు అందరినీ పరిగణనలోకి తీసుకొని వన్‌టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుంది. ఆ తర్వాత కొత్తవి తీసుకోవడానికి రైతులకు అర్హత ఉండదు. దీంతో అన్నదాతలు అటూ ఇటూ కాకుండా పోయారు’ అని విచారం వ్యక్తం చేశారు.