News March 23, 2025
సూర్యాపేట: పది పరీక్షకు 25 మంది ఆబ్సెంట్

సూర్యాపేట జిల్లాలో రెండో రోజు జరిగిన పరీక్షకు 11,901 విద్యార్థులకు గాను 11,876 మంది హాజరుకాగా 25 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపుతున్నామన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Similar News
News March 29, 2025
694 మంది మృతి

నిన్న సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 694 మంది మరణించారని మయన్మార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో 68 మంది మిస్సింగ్ అయినట్లు తెలిపాయి. ఈ విషాద ఘటనలో 1670 మంది గాయపడ్డారని వెల్లడించాయి. అటు అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 1000 ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంపంతో భవనాలు కుప్పకూలగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి.
News March 29, 2025
30 తరాలైన YCP గెలవదు: ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాశినాయన ఆశ్రమానికి 23 హెక్టార్ల స్థలం కావాలని 2023లో నేను లేఖ రాస్తే YCP ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మరోసారి కేంద్ర అటవీ శాఖ మంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తే 13ఎకరాలు ఇస్తామని ఆయన చెప్పారు. డైనోసార్‌లాగా వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది. 30ఏళ్లు కాదు కదా.. 30 తరాలైన వైసీపీ గెలవదు’ అని ఢిల్లీలో ఎమ్మెల్యే అన్నారు.
News March 29, 2025
నేటి నుంచి నాలుగు రోజులపాటు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మార్కెట్ శాఖ ఉన్నత శ్రేణి కార్యదర్శి నేటి నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. శనివారం (ఇవాళ) అమావాస్య, ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న రంజాన్ పండుగ తదుపరి రోజు సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2న పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని మార్కెట్ శాఖ అధికారులు పేర్కొన్నారు.