News March 23, 2025

కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

image

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Similar News

News March 29, 2025

కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో 41.2°C నమోదు కాగా, కరీంనగర్ రూరల్, గంగాధర మండలాల్లో 40.9, ఇల్లందకుంట, మానకొండూర్ 40.7, చిగురుమామిడి 40.6, జమ్మికుంట, తిమ్మాపూర్ 40.5, శంకరపట్నం 40.3, రామడుగు 40.2, గన్నేరువరం 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.3, చొప్పదండి 39.2, వీణవంక 39.0, హుజూరాబాద్ 38.3°C గా నమోదైంది.

News March 29, 2025

జగిత్యాల.. ACCIDENT.. వ్యక్తి మృతి

image

JGTL-KNR ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 11గంటలకు కొండగట్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మధుర నరేశ్ వాహనం అదుపుతప్పి పడగా.. అతన్ని కాపాడేందుకు వచ్చిన మల్యాల(M) గొర్రెగుండానికి చెందిన వంశీధర్ రావును అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీధర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్ఐ తెలిపారు.

News March 29, 2025

కరీంనగర్: ఉగాది నుంచి సన్నబియ్యం

image

ఉగాది నుంచి ప్రజలకు సన్నబియ్యం పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,908 కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నారు. దీంతో 8,04,968 మంది సన్నబియ్యాన్ని పొందుతారు.

error: Content is protected !!