News March 25, 2024

సిద్దిపేట: ‘మట్టి స్నానంతో రోగాలు దూరం’

image

మట్టి స్నానంతో రోగాలు దూరం అవుతాయని, మట్టి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని యోగా శిక్షకుడు తోట సతీశ్ తెలిపారు. వ్యాస మహర్షి యోగా సోసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆదివారం మడ్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 80 మంది మట్టి స్నానం చేశారు. అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

Similar News

News September 8, 2025

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం
చేగుంటలో యూరియా కోసం కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రామయంపేట పీఏసీఎస్ వద్ద క్యూ లైన్ లో రైతులు చెప్పులు పెట్టారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు, నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

News September 8, 2025

చేగుంట: చెట్టును ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

image

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News September 8, 2025

మెదక్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.