News March 23, 2025
కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 1, 2026
ఇరాన్‌లోని లక్ష్యాలపై క్లాడ్ AI సాయంతో US దాడి

ఇరాన్‌పై దాడిలో ఆంథ్రోపిక్ క్లాడ్ AI సాంకేతికను US వినియోగించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. శత్రువులపై నిఘా, యుద్ధంలో లక్ష్యాలను గుర్తించడానికి క్లాడ్‌ను వాడిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వివరించింది. యుద్ధంలో తమ AIని వాడేందుకు ఆంథ్రోపిక్ నిరాకరించడంతో ట్రంప్ దాని కాంట్రాక్టును ఇటీవల రద్దుచేయడం తెలిసిందే. అయితే US రక్షణ వ్యవస్థలో అప్పటికే ఆ AI ఇంటిగ్రేట్ అయి ఉండడంతో వినియోగించారంది.
News March 1, 2026
మండపేట: క్షణికావేశంలో హత్య.. కటకటాలపాలైన అన్నదమ్ములు

మండపేట మండలం ద్వారపూడిలో గురువారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులైన అన్నదమ్ములు అయినవిల్లి చంద్రపాల్, గిరిబాబు పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావును రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపారు. ఆవేశంలో చేసిన ఈ దాడితో సూర్య ప్రకాశరావు మృతి చెందగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2026
కనువిందుగా భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.


