News March 23, 2025

సిద్దిపేట: వేడి నీటిలో పడ్డ చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి

image

ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడి, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. చెప్యాల గ్రామానికి చెందిన పుష్పాల శ్రీశైలం, రవళికి మూడు సంవత్సారాల కూతురు ఉంది. గత నెల 23వ తేదీన స్నానం చేయించడానికి వేడి నీరు పెట్టింది. సబ్బు కోసం రవళి ఇంట్లోకి వెళ్లగా చిన్నారి వేడి నీటిలో పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది.

Similar News

News September 17, 2025

TPT: మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 4వ విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గణేశ్ చెప్పారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చివరి తేదీ సెప్టెంబర్ 27.

News September 17, 2025

హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

image

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్‌ పోలో‌తో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.

News September 17, 2025

జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

image

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.