News March 23, 2025
నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
Similar News
News March 26, 2025
SHOCK: మరికొన్ని రోజుల్లో ఆర్థికమాంద్యం!

2025 ద్వితీయార్థంలో ఆర్థికమాంద్యం వస్తుందని USలో మెజారిటీ కార్పొరేట్ ఫైనాన్స్ చీఫ్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, కన్జూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడమే ఇందుకు కారణమని CNBC CFO కౌన్సిల్ సర్వేలో అభిప్రాయపడ్డారు. మాంద్యం వస్తుందని 3 నెలల క్రితం 7% మంది అంచనా వేయగా ఇప్పుడీ సంఖ్య 60%కి చేరుకుంది. 2026లో ఆర్థిక వ్యవస్థ సంకోచం మొదలవుతుందని మరో 15% అంచనా వేశారు.
News March 26, 2025
గిల్ కెప్టెన్సీ బాలేదు: సెహ్వాగ్

PBKSతో మ్యాచ్‌లో GTకి శుభ్‌మన్ గిల్ చేసిన కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పెదవివిరిచారు. ‘పవర్ ప్లేలో సిరాజ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. గిల్ అతడిని ఆపి అర్షద్‌ను ఎందుకు తీసుకొచ్చాడు? అర్షద్ 21 పరుగులిచ్చాడు. అటు డెత్ ఓవర్ల కోసం పక్కన పెట్టిన సిరాజ్ కూడా ఆయా ఓవర్లలో రన్స్ సమర్పించుకున్నాడు. కెప్టెన్‌గా గిల్ క్రియాశీలంగా, వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపించలేదు’ అని స్పష్టం చేశారు.
News March 26, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్: సీఎం రేవంత్

TG: బెట్టింగ్ యాప్స్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.