News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

Similar News

News September 17, 2025

టెక్కలి: జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సీటీ స్కాన్ సేవలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర కేసులు మినహా మిగతా కేసులకు సీటీ స్కాన్ సేవలు నిలిపివేయడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందుతున్న విషయం విదితమే. సంస్థకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో సేవలు నిలిపివేసినట్లు స్థానికులు అంటున్నారు.

News September 17, 2025

వ్యవసాయ కూలీ టీచర్ ఉద్యోగానికి ఎంపిక

image

వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మెగా డీఎస్సీలో రేపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ 15వ ర్యాంకు సాధించారు. రేపల్లెకు చెందిన సొంటి సురేష్ స్కూల్ అసిస్టెంట్ (సామాజిక శాస్త్రం) విభాగంలో 80.56 మార్కులతో 15వ ర్యాంకు సాధించి 2 పోస్టులకు ఎంపికయ్యారు. సురేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తనకు క్రమశిక్షణ నేర్పిందన్నారు. కష్టపడి చదివితే ఎవరికైనా విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

News September 17, 2025

నూజివీడు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాధికారి రజిత తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను అదే రోజు లోగా వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశమని తెలిపారు.