News March 23, 2025
ధోనీ రిటైర్మెంట్‌పై CSK కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

MS ధోనీ మరి కొన్నేళ్లు ఆడతారా? ఈ ప్రశ్నకు CSK కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర జవాబిచ్చారు. ‘51ఏళ్ల వయసులోనూ సచిన్ మాస్టర్స్ లీగ్‌లో ఎలా ఆడారో చూశాం. కాబట్టి ధోనీలో ఇంకా చాలా ఏళ్ల ఆట మిగిలి ఉందనుకుంటున్నా. 43 ఏళ్ల వయసులోనూ ఆయన జట్టుకోసం పడే కష్టం మా అందరికీ స్ఫూర్తినిస్తుంటుంది. జట్టులో తన పాత్రకు అనుగుణంగా వీలైనన్ని సిక్సులు కొట్టడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
శ్రేయస్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ ప్రశంసలు

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది కాలంలో అయ్యర్ తన ఆటను అద్భుతంగా మెరుగుపర్చుకున్నాడన్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని ఇష్యూస్ తర్వాత ఆటను ఇంప్రూవ్ చేసుకున్న తీరు గొప్పగా ఉందని పేర్కొన్నారు. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో అయ్యర్ 97* పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.
News March 26, 2025
కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.