News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్‌కు ముందు వరుసలో ఉన్నారు.
Similar News
News January 11, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: SP

సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడి పందాలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని SP నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. కోడిపందేలు, జూదం జరిగే అవకాశమున్న అనుమానిత ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందన్నారు. వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కోడి పందేల నిర్వహణకు తోటలు, స్థలాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పవన్నారు.
News January 11, 2026
IMH కడపలో 53 పోస్టులకు నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(IMH), కడపలో 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు జనవరి 5 నుంచి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిప్లొమా(ఆక్యుపేషనల్ థెరపీ, ECG, అనస్థీషియా, యోగా), BA, BSc, MSW, DMLT, MLT, MA(సైకాలజీ), PG డిప్లొమా ,M.Phil ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
News January 11, 2026
గండికోట ఉత్సవాలకు ఎన్ని రూ.కోట్లంటే.!

గండికోట ఉత్సవాలు 6 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలతో పర్యాటకులను అలరించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గండికోట చారిత్రక నేపథ్యాన్ని తెలిపే వీడియోలను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.3 కోట్లను విడుదల చేసింది.


