News March 23, 2025
విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ అధికారి సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా 19.05.2025 లోపు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08542-220020 నెంబర్ పై సంప్రదించాలన్నారు. SHARE IT.
Similar News
News January 3, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ

వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News January 3, 2026
ASF: స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు www.telanganapass.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మెడికల్ కళాశాల అధికారి తెలిపారు.
News January 3, 2026
అకౌంట్లో పడిన ₹40Crతో ట్రేడింగ్.. హైకోర్టు ఏమందంటే?

ముంబైకి చెందిన గజానన్ అనే ట్రేడర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కోటక్ సెక్యూరిటీస్ పొరపాటున ₹40Cr మార్జిన్‌ను అతడి అకౌంట్లో వేసింది. వాటితో ట్రేడింగ్ చేసి అతను 20 ని.ల్లో ₹1.75Cr లాభం పొందాడు. ఆ లాభాన్నీ తిరిగి పొందాలని బ్రోకరేజ్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ట్రేడర్ నైపుణ్యం వల్ల ఆ లాభం వచ్చిందని, తదుపరి విచారణ (FEB 4) వరకూ అతని వద్దే ఉంచుకోవచ్చని మధ్యంతర తీర్పునిచ్చింది.


