News March 23, 2025
కల్వకుర్తి: అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎంపీటీసీ మృతి

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎమ్మెల్యే సొంత గ్రామం ఖానాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గార్లపాటి సరిత (46) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆమె ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఎంపీటీసీగా ఆమె గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News January 17, 2026
రాడార్ల కోసం ‘అండర్ గ్రౌండ్’ మెట్రో

జేబీఎస్-శామీర్‌పేట మెట్రో వైర్ల నుంచి వెలువడే హై-వోల్టేజ్ కరెంటు యుద్ధ విమానాల రాడార్లకు ముప్పుగా మారుతుందని 2025 చివరలో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రేడియేషన్ వల్ల విమానాల ‘టార్గెట్ లాకింగ్’ సిస్టమ్స్ దెబ్బతింటాయని తేలింది. అందుకే ఈ కారిడార్‌లో హకీంపేట వద్ద మెట్రోను <<18874537>>భూమి లోపల<<>> సొరంగంలో తీసుకెళ్తే ఆ మట్టి ఒక సహజ కవచంలా పనిచేసి సిగ్నల్స్ బయటకు రాకుండా ఆపుతుందని ప్లాన్ చేశారు.

ఇరాన్ పరిస్థితిపై కీలక ఫోన్ కాల్

ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో చర్చించారు. మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్లో నెలకొన్న అస్థిరతపై ఇరువురు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇరాన్‌తో మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని పుతిన్ తెలిపినట్లు సమాచారం. శాంతి పునరుద్ధరణకు దౌత్య ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.