News March 23, 2025
కుబీర్: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందిన ఘటన కుభీర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. పార్డి(బి) గ్రామానికి చెందిన RMP వైద్యుడు పోతన్న రోజులాగే గ్రామంలో వైద్యం అందించి ఇంటికి తిరిగి వచ్చారు. శనివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలాడు. గమనించిన ఆయన తల్లి, స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News July 4, 2025
నగర వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్: ఎంపీ చిన్ని

ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విజయవాడ ఉత్సవ్‌పై జరిగిన ప్రాథమిక సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు, తదితరులు పాల్గొని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. విజయవాడ నగర పర్యటన మధురాను భూతులు మిగిల్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిపారు.
News July 4, 2025
20 బైకులను ప్రారంభించిన SP

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.
News July 4, 2025
ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. 2006 తర్వాత ఓ టెస్టులో తొలి 5 ఓవర్లలో 10 ERతో 50 రన్స్ ఇచ్చిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ బజ్ బాల్ ధాటికి ప్రసిద్ధ్ బలైపోయారు. పదే పదే షార్ట్ బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిద్ధ్ సహా మిగతా బౌలర్లూ పెద్దగా ప్రభావం చూపట్లేదు.