News March 23, 2025
BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

TG: కరీంనగర్‌లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 27, 2025
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్..?

జూన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఓడిపోవడంతో పాటు హిట్ మ్యాన్ విఫలమవడంతో టెస్ట్‌లకు కెప్టెన్‌గా తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఈ సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే హిట్ మ్యాన్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.
News March 27, 2025
వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71గా ఉన్న ఆయన ప్రస్తుతం అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని వంశీ విజయవాడ కోర్టును ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ధర్మాసనం ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
News March 27, 2025
SRH మ్యాచ్.. వార్నర్ ఆసక్తికర ట్వీట్

నేడు ఉప్పల్ వేదికగా SRH, LSG మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ సన్ రైజర్స్ 300 పరుగులు చేస్తుందా? అని Xలో ప్రశ్నించారు. ఈ మ్యాచ్ చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అభిషేక్ శర్మ 100, హెడ్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తారని అంచనా వేశారు. కాగా గతంలో SRH సారథిగా వ్యవహరించిన వార్నర్ ఆ జట్టుకు ట్రోఫీ అందించారు.