News March 25, 2024

తూ.గో జిల్లాలో విస్తృతంగా ఉపాధి పనులు

image

తూ.గో జిల్లాలో ఉపాధిహామి పనులు విస్తృతంగా చేపడుతున్నట్లు డ్వామా పీడీ ఎం.ముఖలింగం తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. జనవరి నెల వరకూ కూలీలకు బిల్లులు అందజేశామని అన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఈ పథకం అమలుపై గ్రామ స్థాయి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందడం లేదన్నారు. కూలీలతో పాటు, మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు వివరించారు.

Similar News

News September 28, 2025

విద్యార్దులకు ఆఫర్ లెటర్స్ పంపిణీ

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ‘వికాస’ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 107 మంది ఎంపికయ్యారని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు.

News September 27, 2025

రాజమండ్రి: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

image

రాజమండ్రిలోని పలు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సందర్శించారు. ఆల్కాట్ గార్డెన్, గౌతమీ ఘాట్ వద్ద కొన్ని కుటుంబాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ సూచించారు.

News September 27, 2025

‘ఖాదీ సంత’ విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

image

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించనున్న “ఖాదీ సంత” కార్యక్రమంపై బీజేపీ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించింది. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఖాదీ సంత విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలువురు సూచనలు చేశారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు తీర్మానించారు.