News March 23, 2025

సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు.  సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News November 21, 2025

వివేకా హత్య కేసు.. సీఐ తొలగింపు

image

AP: YS వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన <<17811370>>శంకరయ్యను<<>> ఉద్యోగం నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. కేసుకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని అందులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని శంకరయ్యను డిస్మిస్ చేసింది.

News November 21, 2025

ముంబై డ్రగ్స్ పార్టీ.. హీరోయిన్ సోదరుడికి సమన్లు

image

ముంబై డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌కు యాంటీ నార్కోటిక్స్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. 20న విచారణకు గైర్హాజరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒర్రీ 26న రావాలని సూచించింది. సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించినట్టు డ్రగ్స్ వ్యాపారి మొహమ్మద్ సలీమ్ మొహమ్మద్ సుహైల్ షేక్ అంగీకరించినట్టు ముంబై కోర్టుకు తెలిపింది.

News November 21, 2025

సర్వీస్ నుంచి కర్నూలు సీఐ శంకరయ్య డిస్మిస్

image

సీఐ జె.శంకరయ్యను పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ (తొలగింపు) చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్‌లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు ఆయన తెలిపారు.